Andhra News: వండి నోట్లో పెట్టలేం కదా!: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

‘ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి రూ.లక్షల విలువైన స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి రూ.1.80 లక్షల సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.30వేల రుణం ఇప్పిస్తోంది. అయినా చాలామంది లబ్ధిదారులు

Updated : 15 May 2022 07:34 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి రూ.లక్షల విలువైన స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి రూ.1.80 లక్షల సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.30వేల రుణం ఇప్పిస్తోంది. అయినా చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణం చేపట్టకపోవడం సరికాదు...’ అని ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ప్రగతి సమీక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం ఏ మాత్రం సరిపోవడం లేదని, ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం రూ.3.50 లక్షల వ్యయం అవుతోందని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ‘బియ్యం, కూరగాయలు ప్రభుత్వం ఇస్తే.. వండుకుని తినాల్సింది పేదలే. ప్రభుత్వమే వండి నోట్లో పెట్టలేదు కదా’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని