IND vs PAK: ఓటమి ఇంత భారమా!

ఆదివారం రాత్రి.. సమయం పదిన్నర దాటింది. దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానుల్లో నిశ్శబ్దం.. మనసుల్లో తీరని ఆవేదన.. గుండె లోతుల్లో బాధ. ఏ రోజు కోసమైతే ఇన్నాళ్లు ఎదురు చూశారో.. ఏ మ్యాచ్‌ కోసమైతే ఇంత కాలం నిరీక్షించారో.. ఏ

Updated : 25 Oct 2021 05:27 IST

దివారం రాత్రి.. సమయం పదిన్నర దాటింది. దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానుల్లో నిశ్శబ్దం.. మనసుల్లో తీరని ఆవేదన.. గుండె లోతుల్లో బాధ. ఏ రోజు కోసమైతే ఇన్నాళ్లు ఎదురు చూశారో.. ఏ మ్యాచ్‌ కోసమైతే ఇంత కాలం నిరీక్షించారో.. ఏ ప్రత్యర్థితో తలపడితే సిసలైన క్రికెట్‌ మజా వస్తుందని ఆశించారో.. ఏ జట్టుపై టీమ్‌ఇండియా ఆధిపత్యం కొనసాగించాలని కలలు కన్నారో.. ఇప్పుడు ఆ జట్టు చేతిలోనే ఓటమి ఎదురైతే.. కళ్ల ముందే ఆశలు కూలిపోతుంటే.. చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తేలిపోతే.. భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని భావించిన జట్టు.. ప్రత్యర్థిని కట్టడి చేయలేక చేతులెత్తేస్తుంటే ఓ వైపు ఆగ్రహం.. మరోవైపు బాధతో గుండె బరువెక్కింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్‌ పరాజయంపాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిని  ఏమాత్రం ఊహించని అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటివరకూ దాయాదిపై ఓటమి ఎరుగని టీమ్‌ఇండియా.. తొలిసారి ప్రత్యర్థి ముందు తలవంచడంతో దేశంలోని కోట్లాది హృదయాలు అంతులేని నిరాశలో మునిగిపోయాయి.  

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని