గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలకు స్కోచ్‌ అవార్డు: మంత్రి ముత్యాల నాయుడు

గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్నందుకు 2021 సంవత్సరానికి స్కోచ్‌ అవార్డుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం

Published : 27 May 2022 05:36 IST

ఈనాడు, అమరావతి: గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్నందుకు 2021 సంవత్సరానికి స్కోచ్‌ అవార్డుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కోచ్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ దలాల్‌ ఈ విషయం వెల్లడించారని తెలిపారు. జూన్‌ 18న దిల్లీలో ‘ఇండియన్‌ గవర్నెన్స్‌ ఫోరం’ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేస్తారని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని