ప్రణాళికా లోపంతో మహిళలకు ఇక్కట్లు

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఇలగనూరు వద్ద సీఎం జగన్‌ పర్యటనతో అక్కడి ప్రజలు ఆద్యంతం అవస్థలు పడ్డారు. బహిరంగ సభ లేదని అధికారులు స్పష్టం చేసినా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ

Published : 24 Jun 2022 04:18 IST

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఇలగనూరు వద్ద సీఎం జగన్‌ పర్యటనతో అక్కడి ప్రజలు ఆద్యంతం అవస్థలు పడ్డారు. బహిరంగ సభ లేదని అధికారులు స్పష్టం చేసినా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. అపాచీ పరిశ్రమ భూమిపూజకు సీఎం 12.05కు రావాల్సి ఉండగా, 1.15కు చేరుకున్నారు. పరిశ్రమ ప్రతినిధులు, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, ముఖ్యనేతలను తప్ప ఎవరినీ అనుమతించలేదు. ఈ కార్యక్రమం కోసం ఉదయం 9.30 నుంచి ప్రజలు నిరీక్షించారు. కానీ, వారిని హెలిప్యాడ్‌కు దూరంగా ఇనుప కంచెలు వేసి అక్కడే ఆపేయడంతో ఉదయం నుంచి మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు చెట్ల కింద సేదతీరారు. జనసమీకరణ చేసిన ప్రతినిధులు వారిని అక్కడే వదిలి వెళ్లిపోవడంతో తాగునీరు ఇచ్చేవాళ్లు సైతం లేక అవస్థలు పడ్డారు. సీఎం వచ్చిన పావుగంట తర్వాత భోజనాలు పెట్టారు. అయితే, తాగునీటిలో బ్లీచింగ్‌ కలపడంతో అవి తాగేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ఇక బయటకు వెళ్దామంటే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మళ్లీ హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లాలని చెప్పడంతో జనం అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని