పార్లమెంటు ఆవరణలో అల్లూరి విగ్రహం పెట్టాలి

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ప్రధాని

Published : 03 Jul 2022 05:16 IST

ప్రధాని, లోక్‌సభ స్పీకరుకు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాకు శనివారం విడివిడిగా లేఖలు రాశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో అల్లూరిని చేర్చడంపై తెలుగు ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ తెలుగువారి మనసుల్లో గుర్తుండిపోతుంది. దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సాయుధ పోరాటం చేశారు. ఆయన జీవితం నేటికీ స్ఫూర్తిమంతం. అల్లూరి 125వ జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం సముచితం. దీనిపై గతంలోనే కేంద్రానికి తెదేపా అభ్యర్థన పంపింది. కానీ ప్రభుత్వాల మార్పిడితో జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఆలస్యానికి తావులేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి’ అని లేఖలో చంద్రబాబు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని