వసతులు లేకపోయినా విలీనమే!

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనమైన ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల వివరాలు, రిజిస్టర్లు, టీసీలను అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కిలోమీటరు దూరంలోని

Published : 05 Jul 2022 05:15 IST

3, 4, 5 తరగతుల రిజిస్టర్లు అప్పగించాలని ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనమైన ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల వివరాలు, రిజిస్టర్లు, టీసీలను అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సదుపాయం ఉన్నచోట్లే విద్యార్థులను పంపించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన అధికారులు క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో సదుపాయాలతో సంబంధం లేకుండా కిలోమీటరు దూరంలోని 3, 4, 5 తరగతులను విలీనం చేయడంతోపాటు రికార్డులను అప్పగించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య వందలోపు ఉన్న ప్రాథమికోన్నత బడులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. హేతుబద్ధీకరణతో ఎక్కువగా తేలిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఆయా బడుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఎస్జీటీలు తాత్కాలికంగా సబ్జెక్టు ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. విలీనమైన విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించొద్దని, ప్రస్తుతం ఉన్న రిజిస్టర్‌లోనే కొత్తగా వచ్చిన వారి పేర్లు రాయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని