తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు

రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది (1022-2022) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 13, 14వ తేదీల్లో తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భారతీయ

Published : 08 Aug 2022 05:12 IST

ఈనాడు, అమరావతి: రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది (1022-2022) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 13, 14వ తేదీల్లో తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భారతీయ సమాఖ్య (తెలుగు సాంస్కృతిక సంస్థల సమాహారం) ఒక ప్రకటనలో తెలిపింది. 13న సాయంత్రం 4 గంటలకు కాకినాడలోని బాలాజీ కల్యాణ మండపం నుంచి జేఎన్‌టీయూ వరకూ శ్రీమదాంధ్ర మహాభారత గ్రంథ శోభాయాత్ర నిర్వహించనుంది. 14న కాకినాడ సమీపంలోని తిమ్మాపురం ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో నాలుగు సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం సెషన్‌లో కంచి కామకోటి పీఠం నుంచి చల్లా విశ్వనాథశాస్త్రి, ప్రవచనచక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు, మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ, శాంతా బయోటెక్నిక్స్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, ప్రభల సుబ్రహ్మణ్యశర్మ, ఎర్రమిల్లి శారదలు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, అన్నదానం చిదంబరశాస్త్రి, రాంలాల్‌ ఉపన్యసిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేస్తారు. ఈ సందర్భంగా తెలుగు మహాభారత రత్నమాల పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని