తెదేపా నేత వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం వద్దు

తెదేపా నేత, డీసీసీబీ పూర్వ ఛైర్మన్‌ వరుపుల రాజా వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో జోక్యం చేసుకోవద్దని సీఐడీ, ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో

Published : 11 Aug 2022 03:30 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తెదేపా నేత, డీసీసీబీ పూర్వ ఛైర్మన్‌ వరుపుల రాజా వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో జోక్యం చేసుకోవద్దని సీఐడీ, ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో విచారణ అవసరం అనుకుంటే చట్ట నిబంధనలను పాటించాలని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛలో వారి జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి వరుపుల రాజా హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ‘మీ కోసం మీ ఇంటికీ మీ రాజా’ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారన్నారు. ఇప్పటికే నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు పిటిషనర్‌కు రక్షణ కల్పించిందన్నారు. అయినా పోలీసులు ఇంటికెళ్లి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని