ఊరూవాడా ఏకం చేసిన జెండా!

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నగరాలు, పట్టణాల్లో త్రివర్ణ శోభ ఉట్టిపడుతోంది. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు భారీ పతాకాలు చేబూని వీధుల్లో ప్రదర్శన చేస్తున్నారు. శుక్రవారం

Updated : 13 Aug 2022 06:09 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నగరాలు, పట్టణాల్లో త్రివర్ణ శోభ ఉట్టిపడుతోంది. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు భారీ పతాకాలు చేబూని వీధుల్లో ప్రదర్శన చేస్తున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌, గొందేశి పూర్ణ చంద్రారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు 5 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 1500 మీటర్ల జెండాతో రాష్ట్రపతి రోడ్డు మీదుగా ఎన్టీఆర్‌ పార్కు వరకు ప్రదర్శన కొనసాగింది. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, తణుకు, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని