ము‘వ్వెన్నెల్లో’ శ్రీశైలం!

ప్రాజెక్టు క్రస్టుగేట్ల నుంచి పాల నురగల్లా దూకుతున్న కృష్ణా జలాలకు త్రివర్ణ కాంతులు వన్నెలద్దాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీశైలం జలాశయం ఆనకట్టకు నీటి పారుదల శాఖ అధికారులు

Published : 14 Aug 2022 03:24 IST

ప్రాజెక్టు క్రస్టుగేట్ల నుంచి పాల నురగల్లా దూకుతున్న కృష్ణా జలాలకు త్రివర్ణ కాంతులు వన్నెలద్దాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీశైలం జలాశయం ఆనకట్టకు నీటి పారుదల శాఖ అధికారులు మూడు రంగుల దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రాజెక్టు త్రివర్ణ కాంతులీనుతోంది. మరోవైపు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 3,59,051 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు శ్రీశైలం జలాశయ 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. 3,76,170 క్యూసెక్కుల ప్రవాహాన్ని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తరలివస్తున్న సందర్శకులు ము‘వెన్నెల్లో’ తడుస్తున్న ప్రాజెక్టు సౌందర్యాన్ని తిలకిస్తున్నారు.

- న్యూస్‌టుడే, సున్నిపెంట సర్కిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని