ఆరోగ్య ఆంధ్రగా మార్చాలన్నదే ఆశయం

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే తన ఆశయమని సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో బుధవారం తన సతీమణి

Published : 18 Aug 2022 04:23 IST

 ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురంలో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభం

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే తన ఆశయమని సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో బుధవారం తన సతీమణి వసుంధరాదేవితో కలిసి ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్యరథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రూ.40లక్షలతో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథాన్ని తయారు చేయించాం. ఇందులోని పరికరాలకు దాదాపు రూ.10లక్షల వరకు వ్యయమైంది. ఇందులో 200 రకాల వ్యాధులకు వైద్యపరీక్షలు చేస్తారు. మాతాశిశు సేవలు, ఈసీజీ, అధునాతన ఆక్సిమీటర్‌, మైక్రోస్కోప్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. వైద్యసేవలు పొందినవారికి 107 రకాల మందులను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా అందిస్తాం. రోజంతా ఒక గ్రామంలో ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు. వ్యాధుల తీవ్రతను బట్టి వైద్యనిపుణుల సలహాలు తీసుకొని వైద్యం చేస్తారు. కంప్యూటర్‌లో పేర్లు నిక్షిప్తం చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు తరచూ ఆరాతీస్తారు. ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్యరథం వైద్యసేవలకు ఎవరైనా ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తే వదలబోం. గత ప్రభుత్వ పాలనలో హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం, మాతాశిశు ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. హిందూపురాన్ని ఆరోగ్యపురంగా మార్చేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సూచనల మేరకు ఎన్టీఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సహకారంతో ముందుకు వెళుతున్నాం’ అని బాలకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని