మతసామరస్యం పెంచడానికే వారికి గౌరవ వేతనాలు

రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంచడానికే అర్చకులు, పాస్టర్లు, ముల్లాలు, మౌజమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు ఇస్తోందని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన

Published : 19 Aug 2022 04:18 IST

మంత్రి అంజాద్‌ బాషా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంచడానికే అర్చకులు, పాస్టర్లు, ముల్లాలు, మౌజమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు ఇస్తోందని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జాన్‌వెస్లి అధ్యక్షతన  గురువారం విజయవాడలో పాస్టర్లకు గౌరవ వేతనాల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ‘చాలామంది ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోలేదని తెలిసింది. మరింతమందికి అవకాశం కల్పించేందుకు వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తాం. క్రైస్తవ సామాజికవర్గం జగన్‌కు అండగా ఉంది. వైకాపా విజయంలో పాస్టర్లు కీలకపాత్ర పోషించారు’ అన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..క్రైస్తవులపై దాడులకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని