సామగ్రి వెనక్కి ఇవ్వకుంటే పోలీసు కేసులు

కంటి వెలుగు కింద పథకం కింద పనిచేసే ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు.. ట్యాబులు, స్క్రీనింగ్‌ బుక్స్‌, కళ్లజోళ్లు వెనక్కి ఇవ్వకుంటే పోలీసు కేసులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తమకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ

Published : 19 Aug 2022 04:18 IST

ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లకు జిల్లా అధికారుల హెచ్చరిక

ఈనాడు, అమరావతి: కంటి వెలుగు కింద పథకం కింద పనిచేసే ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు.. ట్యాబులు, స్క్రీనింగ్‌ బుక్స్‌, కళ్లజోళ్లు వెనక్కి ఇవ్వకుంటే పోలీసు కేసులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తమకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారు ఈనెల 16 నుంచి విధులు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో వీరి నుంచి సామగ్రిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. సామగ్రి వెనక్కి ఇవ్వకుంటే పోలీసు కేసుల నమోదు వరకు వెళ్లాల్సి ఉంటుందని గురువారం సమాచారం పంపారు. సామగ్రి తిరిగి ఇచ్చేస్తే తమను అసలు పట్టించుకోరని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పైగా పోలీసు కేసుల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని