విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల 5వ మహాసభలు ఈ ఏడాది డిసెంబరు 23, 24వ తేదీల్లో విజయవాడలోని పి.బి.సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయి. మహాసభల

Updated : 24 Sep 2022 04:19 IST

డిసెంబరు 23, 24వ తేదీల్లో నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు రచయితల 5వ మహాసభలు ఈ ఏడాది డిసెంబరు 23, 24వ తేదీల్లో విజయవాడలోని పి.బి.సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయి. మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డా।। జి.వి.పూర్ణచందు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం-కార్యాచరణ’, తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రచయితలు, సాహిత్యాభిమానులు అక్టోబరు 31లోగా రూ.500 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. చెల్లింపులను 93912 38390 నంబరుకు ఫోన్‌ ద్వారా చేయవచ్చని పేర్కొన్నారు.  మరిన్ని వివరాలకు ఇదే నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని