కట్టారు.. వదిలిపెట్టారు..

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన బాలికల వసతి గృహం నిరుపయోగంగా మారింది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే బాలికలు ఇక్కడే ఉండి

Published : 25 Sep 2022 05:50 IST

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన బాలికల వసతి గృహం నిరుపయోగంగా మారింది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే బాలికలు ఇక్కడే ఉండి పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ నిధులు రూ.1.94 కోట్లు వెచ్చించి దీన్ని కట్టారు. మంత్రి బూడి ముత్యాల నాయుడు విప్‌గా ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం ఈ భవనాన్ని ప్రారంభించారు. బాలికలు ఉండేందుకు సౌకర్యాలు కల్పించలేదు. అంతేకాక వార్డెన్‌, వంట మనిషి, వాచ్‌మన్‌లను నియమించకపోవడంతో వసతి గృహం ఇప్పటికీ వినియోగంలోనికి రాలేదు.

- న్యూస్‌టుడే, కె.కోటపాడు, ఈనాడు, అనకాపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని