ఘనంగా సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వేడుకలు

సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 23న ఘనంగా జరిగింది. సమాజసేవకులు జహీర్‌బేగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

Updated : 28 Sep 2022 05:35 IST

ఈనాడు, అమరావతి: సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 23న ఘనంగా జరిగింది. సమాజసేవకులు జహీర్‌బేగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఖురాన్‌ పఠనం, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ లక్ష్యాలు, సేవలను సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు నాగశేఖర్‌ వివరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల బీమాపై ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌, కార్యవర్గ సభ్యులు పారేపల్లి వీబీ కిశోర్‌, వరప్రసాద్‌ వివరించారు. వేడుకల్లో భాగంగా పాటలు, నృత్యాలు, నాటికలను ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనలు వార్షికోత్సవానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. తెలుగువారందరికీ తమ సమాఖ్య చేదోడువాదోడుగా నిలుస్తుందని కార్యదర్శి కోనేరు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని