కొలకలూరి ఇనాక్‌కు మహామహోపాధ్యాయ అవార్డు ప్రదానం

ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. విద్య నేర్పిన ఉపాధ్యాయుడికి శిష్యుడేనని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

Updated : 03 Oct 2022 06:46 IST

వకుళాభరణం కృష్ణమోహన్‌కు ‘బీసీ యోధ’ పురస్కారం

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. విద్య నేర్పిన ఉపాధ్యాయుడికి శిష్యుడేనని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఎ.అగ్రహారం రాజారత్న కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘ఐడియల్‌ టీచింగ్‌ అవార్డు 2022’ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహామహోపాధ్యాయ అవార్డును రచయిత, కవి, సాహితీవేత్త కొలకలూరి ఇనాక్‌కు, విద్యా రంగంలో విశేష కృషి చేసిన 150 మందికి ఐటాప్‌-2022 అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఒక ఇంజినీరు తప్పు చేస్తే భవనం మాత్రమే కూలిపోతుందని, ఉపాధ్యాయుడు తప్పుచేస్తే సమాజమే నాశనమవుతుందన్నారు. ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ పేదరికాన్ని జయించడానికి విద్య ఒక్కటే ఆయుధమన్నారు. తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ యోధ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ చేతులమీదుగా అవార్డు అందజేశారు. విద్యా సంస్థల ఛైర్మన్‌ డా.ఆర్‌.బి.అంకం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని