యువ చైతన్యం.. బురద మాయం

దసరాకు సొంతూరు వచ్చిన యువ ఉద్యోగులు తమ గ్రామ రోడ్డును బాగు చేసుకొని ఆదర్శంగా నిలిచారు.

Published : 08 Oct 2022 03:40 IST

సైదాపురం, న్యూస్‌టుడే: దసరాకు సొంతూరు వచ్చిన యువ ఉద్యోగులు తమ గ్రామ రోడ్డును బాగు చేసుకొని ఆదర్శంగా నిలిచారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఊటుకూరు నుంచి ఆదూరుపల్లి దాకా 2 కి.మీ. తారు రోడ్డు వేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఎన్నికల కోడ్‌ కారణంగా నిధులు వెనక్కి వెళ్లాయి. నాటి నుంచి అక్కడి ప్రజలు వర్షమొస్తే బురదలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. దసరా నేపథ్యంలో గ్రామానికి వచ్చిన పలువురు యువకులు దాదాపు రూ.2 లక్షలు జమచేసి.. రోడ్డుపై కంకరను తోలి, రోలింగ్‌ చేయించి బాగు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని