ఒక రోజులో10కి మించి దరఖాస్తులు ఇవ్వొద్దు

ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు రోజుకు పదికి మంచి దరఖాస్తులను నేరుగా సమర్పించవద్దని ఎన్నికల సంఘం పేర్కొంది.

Published : 24 Nov 2022 05:23 IST

పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు రోజుకు పదికి మంచి దరఖాస్తులను నేరుగా సమర్పించవద్దని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయా దరఖాస్తుల వివరాలతో పాటు లిఖిత పూర్వక ప్రకటన (రిటన్‌ డిక్లరేషన్‌) ఇవ్వాలని నిర్దేశించింది. ప్రత్యేక సమగ్ర సవరణ-2023 ప్రక్రియ కొనసాగే కాలవ్యవధిలో ఎవరైనా పోలింగ్‌ బూత్‌ ఏజెంట్‌ 30 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు పునః తనిఖీ చేపట్టాలని పేర్కొంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా బుధవారం ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా జాబితాను పరిశీలించి ఏవైనా సవరణలు అవసరమైతే వాటి కోసం దరఖాస్తు చేసుకునేలా ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లకు ఏజెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని