ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లన్నీ భర్తీ

ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి అన్ని సీట్లు భర్తీ అయినట్లు ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. ఆదివారం నూజివీడు ప్రాంగణంలో నిర్వహించిన ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో 121 సాధారణ, 20 క్రీడా కోటా సీట్లను భర్తీ చేశారు.

Updated : 28 Nov 2022 05:18 IST

నూజివీడు, న్యూస్‌టుడే: ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి అన్ని సీట్లు భర్తీ అయినట్లు ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. ఆదివారం నూజివీడు ప్రాంగణంలో నిర్వహించిన ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో 121 సాధారణ, 20 క్రీడా కోటా సీట్లను భర్తీ చేశారు. దీంతో మొత్తం 4 ప్రాంగణాల్లోని 4,400 సీట్లు భర్తీ అయ్యాయి. అఖరి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కులపతి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ప్రవేశాల కన్వీనర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని