అనంతపురం-గుంటూరు ఎన్‌హెచ్‌లో 2 ప్యాకేజీల టెండర్లు ఖరారు

అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి-544డి విస్తరణలో భాగంగా రెండు ప్యాకేజీల్లో టెండర్లు ఖరారు అయ్యాయి. వీటిలో తొలి ప్యాకేజీ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా, రెండవది మేఘ ఇంజినీరింగ్‌ సంస్థలు దక్కించుకున్నాయి.

Updated : 02 Dec 2022 05:34 IST

పనులు దక్కించుకున్న ఎస్‌ఆర్‌సీ, మేఘ

ఈనాడు-అమరావతి: అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి-544డి విస్తరణలో భాగంగా రెండు ప్యాకేజీల్లో టెండర్లు ఖరారు అయ్యాయి. వీటిలో తొలి ప్యాకేజీ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా, రెండవది మేఘ ఇంజినీరింగ్‌ సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగు వరసల కింద నిర్మించనున్న ఈ రహదారికి హైబ్రీడ్‌ యాన్యూటీ మోడ్‌ (హ్యామ్‌) కింద ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. వీటి ధరల బిడ్లు గురువారం తెరిచారు.

* మొదటి ప్యాకేజీలో భాగంగా అనంతపురం శివారు పామురాయి నుంచి ముచ్చుకోట వరకు 39.380 కి.మీ.మేర రూ.684.03 కోట్ల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇందులో అంచనా కంటే 1.12 శాతం తక్కువకు కోట్‌చేసిన ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఎల్‌-1గా నిలిచి పని దక్కించుకుంది. అంచనా కంటే 0.90 శాతం తక్కువకు కోట్‌చేసిన మేఘ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌-2 నిలిచింది.

* రెండో ప్యాకేజీలో ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కి.మీ. మేర రూ.738.82 కోట్ల అంచనా విలువతో టెండరు పిలిచారు. ఇందులో అంచనా కంటే 0.74 శాతం తక్కువకు కోట్‌చేసిన మేఘ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌-1గా నిలిచి ఈ పని దక్కించుకుంది.

* రెండేళ్లలో ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని