జేసీ ప్రభాకర్‌రెడ్డి భిక్షాటన.. అడ్డుకున్న పోలీసులు

తాడిపత్రిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తలపెట్టిన భిక్షాటనను పోలీసులు అడ్డుకున్నారు.

Published : 08 Dec 2022 04:31 IST

ఈనాడు డిజిటల్‌-అనంతపురం, తాడిపత్రి-న్యూస్‌టుడే: తాడిపత్రిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తలపెట్టిన భిక్షాటనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో 12 చెత్త తరలించే వాహనాలు మూలనపడ్డాయి. వాటిని బాగు చేసేందుకు అధికారులు నిధులు ఇవ్వనందున భిక్షాటన చేసి ప్రజల నుంచే సేకరిస్తానని ప్రభాకరరెడ్డి ప్రకటించారు. బుధవారం అనుచరులతో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను, అనుచరులను కొంతదూరం తోసుకుంటూ వెళ్లారు. దీంతో పోలీసులకు, జేసీ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీకి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని సీఐ ఆనందరావు తెలపడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కొందరు చెత్త వాహనాలను వితరణగా ఇచ్చారని.. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని మూలన పడేసి.. వారి సొంత వాహనాలను అద్దెకు పెట్టించి ప్రజల సొమ్ము దండుకుంటున్నారని ఆరోపించారు. డీజిల్‌ వినియోగంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని