సీఎంవోలో అధికారులకు శాఖల కేటాయింపు

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఆదేశాలిచ్చారు.

Published : 08 Dec 2022 05:13 IST

ఈనాడు-అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఆదేశాలిచ్చారు. ఇటీవలి వరకూ సీఎంవోలో బాధ్యతలు నిర్వర్తించిన జవహర్‌రెడ్డి సీఎస్‌గా నియమితులవ్వటం, ఆ స్థానంలోకి పూనం మాలకొండయ్య వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంవో అధికారులు చూస్తున్న శాఖల బాధ్యతలను పునర్‌వ్యవస్థీకరించారు. అధికారులు, వారికి కేటాయించిన శాఖల వివరాలివి.. 

పూనం మాలకొండయ్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి:

సాధారణ పరిపాలన, పాఠశాల, ఇంటర్‌, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్యం,  ఆరోగ్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు - పెట్టుబడులు - మౌలిక వసతులు, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, స్త్రీ, శిశు సంక్షేమం. కేంద్ర ప్రభుత్వంతో కరస్పాండెన్స్‌.

కె.ధనుంజయరెడ్డి, కార్యదర్శి:

ఆర్థిక, ప్రణాళిక, హోం, జలవనరులు, పురపాలక-పట్టణాభివృద్ధి, సీఆర్‌డీఏ, ఇంధన, అటవీ, గనులు శాఖలు.

రేవు ముత్యాల రాజు, అదనపు కార్యదర్శి:

రెవెన్యూ (పన్నులు, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, దేవాదాయ), న్యాయ, శాసన వ్యవహారాలు, రెవెన్యూ (భూములు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, సర్వే ల్యాండ్‌ రికార్డులు, సీఎంఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణ), రవాణా - రహదారులు, భవనాలు, ఆర్టీసీ, పర్యాటకం, యువజన సంక్షేమం, కార్మిక, ఉపాధి కల్పన, సీఎంవో ఎస్టాబ్లిష్‌మెంట్‌.

డా.నారాయణ భరత్‌ గుప్తా, సంయుక్త కార్యదర్శి:

గృహనిర్మాణం (వైయస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కార్యక్రమం), పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సెర్ప్‌, గ్రామ, వార్డు సచివాలయాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, స్త్రీ, శిశు సంక్షేమం మినహా అన్ని సంక్షేమ శాఖలు, సీఎం హామీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని