శ్మశానంలో ధాన్యం ఆరబోత!

ధాన్యం చేతికొచ్చినా కొనుగోళ్లు ఊపందుకోలేదు. మరోవైపు తుపాను హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి.

Published : 09 Dec 2022 03:20 IST

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: ధాన్యం చేతికొచ్చినా కొనుగోళ్లు ఊపందుకోలేదు. మరోవైపు తుపాను హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యంలో తేమ శాతం పెరగకుండా ఉండేందుకు రైతులు ఎక్కడ ఖాళీ చోటు కనిపిస్తే అక్కడ ఆరబోస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని చిన్నమతలబుపేట గ్రామానికి చెందిన రైతు శ్మశానంలో ధాన్యం ఆరబోశారు. కొంత బస్తాల్లో మూటగట్టి అక్కడే ఉన్న గదుల్లో వేశారు. సరుబుజ్జిలిలోని డీసీసీబీ కొనుగోలు కేంద్రాన్ని గత నెల 23న సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అధికారులు 12 ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించారు. నేటికీ పూరిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టలేదు. ఈ విషయాన్ని తహసీల్దారు బి.రమేష్‌ కుమార్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా.. ‘సిబ్బంది కొరత వల్ల జాప్యం జరుగుతోంది. శుక్రవారం నుంచి ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేస్తాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని