పోలీసుల నిర్లక్ష్యం వల్లే తపస్వి ప్రాణాలు పోయాయి

పోలీసుల నిర్లక్ష్యం వల్లే గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో దంత వైద్య విద్యార్థిని తపస్వి హత్యకు గురయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 09 Dec 2022 04:39 IST

డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలీసుల నిర్లక్ష్యం వల్లే గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో దంత వైద్య విద్యార్థిని తపస్వి హత్యకు గురయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఘోరమైన దాడులు జరిగాకే ప్రభుత్వం స్పందిస్తోందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి గురువారం ఆయన లేఖ రాశారు. ‘పోలీసుల శాంతిభద్రతల వైఫల్యం కారణంగా రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి. గతేడాది రమ్య హత్య మరచిపోక ముందే గుంటూరులో అదే తరహా ఘటన మరొకటి జరగడం శోచనీయం.  నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

* హత్యకు గురైన దంతవైద్య విద్యార్థిని తపస్వి తల్లిదండ్రులు సీతారత్నం, పి.మహేశ్‌కుమార్‌లను చంద్రబాబు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న వారిని ఓదార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని