Rushikonda: వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండ మీద రీడెవలప్‌మెంట్ హిల్ రిసార్టు పనులు వేగంగా సాగుతున్నాయి.
ఫిబ్రవరి 3లోగా బిడ్ల దాఖలుకు అవకాశం
ఈనాడు, విశాఖపట్నం: ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండ మీద రీడెవలప్‌మెంట్ హిల్ రిసార్టు పనులు వేగంగా సాగుతున్నాయి. 4 బ్లాకుల్లో నిర్మాణాలు చేపడుతుండగా త్వరలో ఒక బ్లాకును అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో విశాఖ నుంచే పాలన సాగుతుందని కొందరు మంత్రులంటున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండపై పనులు వేగం పుంజుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు కన్సల్టెన్సీని ఆహ్వానించిన ఏపీటీడీసీ... తాజాగా వేంగి బ్లాక్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఫిబ్రవరి మూడో తేదీలోగా బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
వేంగి బ్లాకులో పరిపాలన భవనం!
రుషికొండపై ఏం కడుతున్నారన్న విషయమై ముందునుంచే అనేక సందేహాలు నెలకొన్నాయి. సీఎం క్యాంపు కార్యాలయం కోసం కడుతున్నారని ముందు నుంచీ అనధికారికంగా అంటున్నారు. జీవీఎంసీకి ఏపీటీడీసీ సమర్పించిన ఆకృతుల్లో కార్యాలయాల అవసరాలకు వీలుగానే ప్లాన్లు సమర్పించారని చెబుతున్నారు. కొండ మీద మొత్తం 4 బ్లాకులుగా సముదాయాలను నిర్మించేందుకు ఏపీటీడీసీ అనుమతి కోరింది. వేంగి, గజపతి, కళింగ, విజయనగరం పేర్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేంగి బ్లాకును 3 నెలల్లోగా పూర్తి చేయాలని టెండర్లు పిలిచింది. ఇందులో భవన నిర్మాణ తుదిదశ పనులు, విద్యుదీకరణ, నెట్‌వర్కింగ్ పనులతో పాటు కొండవాలు రక్షణ పనులు చేపట్టనున్నారు. జీవీఎంసీకి సమర్పించిన వివరాల ప్రకారం 1713.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ వేంగి బ్లాక్‌ను నిర్మించనున్నారు. కిచెన్, డార్మెటరీ భవనాలూ ఇందులో వస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!
-
Sports News
T20 Cricket: టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా..
-
General News
MLC kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా