JEE Main: జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తుది కీ విడుదల

జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే.

Updated : 07 Feb 2023 06:56 IST

నేడు ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 తుది కీ(https://jeemain.nta.nic.in/)ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే. బీటెక్‌ సీట్ల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 8.60 లక్షల మంది రాయగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉన్నారు. తుది కీ విడుదల చేసిన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా విద్యార్థుల స్కోర్‌ను వెల్లడించనున్నారు. అంటే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు చివరి విడత పరీక్షలు ఏప్రిల్‌లో జరగనుండగా దానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని