తీవ్ర ఒత్తిళ్లతోనే ప్రేమ్‌రాజు బలవన్మరణం

తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలోనే ప్రేమ్‌రాజు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తండ్రి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 21 Mar 2023 05:35 IST

తండ్రి రామరాజు ఆవేదన

కొవ్వూరు పట్టణం(చాగల్లు), న్యూస్‌టుడే: తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలోనే ప్రేమ్‌రాజు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తండ్రి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఆత్మహత్యకు పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి కళ్లేపల్లి ప్రేమ్‌రాజు కుటుంబ సభ్యులను పలువురు పట్టణ ప్రముఖులు,  వివిధ పార్టీల నాయకులు, కొవ్వూరు డీఎస్పీ వర్మ సోమవారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ప్రేమ్‌రాజు వద్ద స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌లోనే సమగ్ర సమాచారం లభ్యమవుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్య ఘటనపై విచారించేందుకు ప్రత్యేకాధికారులను నియమించాలని వారు కోరారు.

కాల్‌డేటా బయటపెట్టాలి

‘ప్రేమ్‌రాజు కాల్‌డేటా బయటపెట్టాలి. ఇసుక ర్యాంపులపై ఆయనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కాంట్రాక్టును కొనసాగించకుండా వేరేవారికి ఇచ్చి తీవ్రంగా అవమానించడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు. సీఎం కార్యాలయ వ్యక్తుల హస్తం ఉండటమే ఇంతటి స్కామ్‌కు కారణం’

 కె.ఎస్‌.జవహర్‌, మాజీ మంత్రి, తెదేపా నేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని