మిల్క్‌ ఎనలైజర్ల లైసెన్సు, సేకరణ కేంద్రాల నమోదు

మిల్క్‌ ఎనలైజర్ల లైసెన్సు, పాల సేకరణ కేంద్రాల నమోదుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది.

Updated : 21 Mar 2023 06:17 IST

బిల్లును ఆమోదించిన శాసనసభ

ఈనాడు-అమరావతి: మిల్క్‌ ఎనలైజర్ల లైసెన్సు, పాల సేకరణ కేంద్రాల నమోదుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం శాసనసభ ఆమోదించింది. ఈ చట్టం కారణంగా పాడి రైతులకు తక్షణమే ప్రయోజనం చేకూరుతుందని, గిట్టుబాటు ధరలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది పాల సేకరణ కేంద్రాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎనలైజర్లతో ఫ్యాట్‌, ఎస్‌ఎన్‌ఎఫ్‌, నీటి పరిమాణం ప్రమాణాల నిర్ధారణలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, నిబంధనలను ఉల్లంఘిస్తే పాల సేకరణ కేంద్రాల నమోదును రద్దు చేయొచ్చని తెలిపింది.


భూసర్వేలో పొరపాట్లు లేవు: రెవెన్యూశాఖ

సమగ్ర భూసర్వేలో ఎలాంటి పొరపాట్లూ ప్రభుత్వం దృష్టికి రాలేదని రెవెన్యూ శాఖ తెలిపింది. సమగ్ర భూసర్వేకు సంబంధించి తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ అడిగిన ప్రశ్నకు రెవెన్యూశాఖ సమాధానమిచ్చింది. పట్టాదారు పాసుపుస్తకంలో పేర్కొన్న వాస్తవ భూమి పరిమాణం, సర్వేలో నమోదు చేసిన పార్సిల్‌ పరిమాణంలో వ్యత్యాసం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? అని ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని