శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు.

Updated : 23 Mar 2023 06:38 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని ఫలపుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు.

శ్రీవాణి టికెట్లలో కోత: వేసవి రద్దీ పెరగనున్నందున శ్రీవాణి టికెట్లను త్వరలో రోజూ 500 వరకు తగ్గించి ఎక్కువమంది సామాన్యులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ తగ్గే వరకు ఇది కొనసాగిస్తామన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్‌ వద్ద 30 అదనపు కౌంటర్లను రూ.5.25 కోట్లతో నిర్మించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తితిదే ధర్మకర్తల మండలి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ఆమోదించిన రూ.4,411.68 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు నిర్మాణం ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయించి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్త రోడ్డును మంజూరు చేశామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని