వజ్ర కవచధారిగా వరప్రదాత

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం రుత్వికులు శాంతి హోమం నిర్వహించారు.

Published : 03 Jun 2023 05:13 IST

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం రుత్వికులు శాంతి హోమం నిర్వహించారు. పూజల అనంతరం కంకణధారణ చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకారసేవ అనంతరం ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని