ఆర్టీసీ ఉద్యోగులతో త్వరలో సమావేశం.. యూనియన్‌ నేతలకు ఎండీ హామీ

ఆర్టీసీలో కేడర్‌ స్ట్రెంగ్త్‌ విషయంలో ఏర్పడిన ఇబ్బందులపై యూనియన్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలని, 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు పూర్తిచేయాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలు, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకాతిరుమలరావుని కోరారు.

Published : 06 Jun 2023 04:21 IST

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో కేడర్‌ స్ట్రెంగ్త్‌ విషయంలో ఏర్పడిన ఇబ్బందులపై యూనియన్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలని, 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు పూర్తిచేయాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలు, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకాతిరుమలరావుని కోరారు. ఈయూ నూతన కమిటీ సోమవారం ఆర్టీసీ హౌస్‌లోని ఎండీని కలిసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు దామోదరరావు.. నూతన కమిటీని ఎండీకి పరిచయం చేశారు. ఉద్యోగులకు చెందిన అనేక అంశాలను ఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేసి, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగిస్తామని ఎండీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈయూ అధ్యక్షుడిగా దామోదరరావు

ఈయూ నూతన అధ్యక్షుడిగా పలిశెట్టి దామోదరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పి.సుబ్రమణ్యంరాజు, ముఖ్య ఉపాధ్యక్షులుగా ఎస్కే సుభానీ, కె.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పి.సత్యనారాయణ, కోటేశ్వరరావు, శంకర్‌రావు, రామచంద్రరావు, ఎస్వీ రావు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జీవీ నర్సయ్యతోపాటు ఇతరులను కమిటీలోని వివిధ పోస్టుల్లో నియమించినట్లు.. ఓ ప్రకటనలో తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని