పులిచింతలలో నీరుంది.. పట్టిసీమ అక్కర్లేదు
పులిచింతల ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నందున పట్టిసీమ నీరు అవసరం లేదని రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
మంత్రి అంబటి రాంబాబు
కృష్ణా తూర్పు డెల్టాకు నీటి విడుదల
విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నందున పట్టిసీమ నీరు అవసరం లేదని రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణా ఈస్ట్రన్ డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సాగునీటిని మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, డి.నాగేశ్వరరావులతో కలిసి మంత్రి రాంబాబు బుధవారం విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకే ముందస్తుగా కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరుకు నీటిని విడుదల చేసేవారని ప్రస్తుతం పులిచింతలలో 34 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నందున గత ఏడాదికంటే ముందుగా విడుదల చేస్తున్నామన్నారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల నిర్మాణం చేయడంతో నేడు నీటిని నిల్వ చేసేందుకు అవకాశం కలిగిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.