Atchannaidu: కోర్టు నిబంధనల మేరకే చంద్రబాబు కాన్వాయ్‌ సాగింది: అచ్చెన్నాయుడు

వైకాపాను ప్రజలు ఛీకొడుతున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 02 Nov 2023 07:47 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపాను ప్రజలు ఛీకొడుతున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలు పాటిస్తూనే.. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసం వరకు చంద్రబాబు వాహనశ్రేణి సాగిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటలు పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికి నాలుగు రెట్ల జనం అధికంగా వచ్చేవారు. చంద్రబాబు నిబంధనల్ని ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారు. లోకేశ్‌ దిల్లీ వెళితే వైకాపా వాళ్లకెందుకు ఉలికిపాటు? అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం చూపించలేకపోయారు. ఇప్పుడు తెదేపా ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయంటూ మరో కొత్త కేసు పెట్టారు. వైకాపా వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా తెదేపాను ఏం చేయలేరు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని