రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు

రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ అన్నారు.

Updated : 20 Apr 2024 05:44 IST

ఐక్యవేదిక సమావేశంలో ఛైర్మన్‌ సూర్యనారాయణ

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నెల్లూరులో ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయంతో ఆత్మగౌరవం లేకుండా బానిసల్లా బతుకుతూ హక్కుగా సంక్రమించిన వాటిని కూడా అడగలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు. ప్రశ్నిస్తే సంఘాలపై ప్రభుత్వం దాడికి పాల్పడడం చూశామన్నారు. జీతాలు ఒకటో తేదీ వేయమని అడిగితే ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టి వెంటాడిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌, గ్రామ, వార్డు సెక్రటరీ సమస్యలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌, జీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణ, 12వ పీఆర్‌సీ సత్వరమే అమలు చేసి డీఏలు చెల్లించాలని కోరారు. అనంతరం 12 డిమాండ్లపై తీర్మానాలు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌, కో ఛైర్మన్‌ కె.హరికృష్ణ, జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని