ఓపెన్‌ స్కూల్‌ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పది, ఇంటర్‌ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు.

Published : 26 Apr 2024 03:53 IST

పదిలో 55.81%, ఇంటర్‌లో 65.77% ఉత్తీర్ణత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పది, ఇంటర్‌ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు. పదో తరగతిలో 55.81 శాతం, ఇంటర్‌లో 65.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పది పరీక్షలకు 32,581 మంది హాజరుకాగా.. వారిలో 18,185 మంది పాసయ్యారు. ఇంటర్‌ పరీక్షలను 73,550 మంది రాయగా 48,377 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ ఒకటి నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు సార్వత్రిక విద్యాపీఠం సంచాలకుడు నాగేశ్వరరావు తెలిపారు. దానికి సంబంధించిన ఫీజును ఏప్రిల్‌ 29 నుంచి మే 10 వరకు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు. పునః మూల్యాంకనం, లెక్కింపునకు ఏప్రిల్‌ 29 నుంచి మే 7 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని