ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది.

Published : 30 Apr 2024 06:17 IST

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. తిరుపతి జిల్లా తడ మండలంలోని ఇరకం దీవి ప్రజలు మండల కేంద్రంలోని బ్యాంకులకు చేరుకోవాలంటే పులికాట్‌ సరస్సులోంచి వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో 234 మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరికి నేరుగా గ్రామంలోని సిబ్బంది పింఛను సొమ్ము అందజేసే వీలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 26 మందికి మాత్రమే ఇంటివద్ద పింఛను అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన 208 మంది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని తడలో బ్యాంకులకు వచ్చి సొమ్ము తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీరికి రానుపోను, బ్యాంకుల వద్ద పడిగాపులకే రోజంతా వృథా అయిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని