పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి

ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్‌బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 03:34 IST

హైదరాబాద్‌లోని ఏపీ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పిలుపు

ఈనాడు, అమరావతి: ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్‌బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ‘ముఖ్యంగా రివర్స్‌ పీఆర్‌సీ, కరవు భత్యం బకాయిలు, పింఛనుదారుల పీఆర్‌సీ బకాయిలు రాకపోవడం, దాచుకున్న డబ్బులూ సకాలంలో వెనక్కి ఇవ్వకపోవడం వంటివి చూశాం. హెల్త్‌కార్డులు సరిగా చెల్లుబాటు కాలేదు. పింఛనుదారులకు సంబంధించి అదనపు క్వాంటం పెన్షన్‌ 10 నుంచి 7 శాతానికి, 15-12 శాతానికి తగ్గించడం.. ఇలా ఎన్నో విధాలుగా ఐదేళ్లలో ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపోయారు. ఉద్యోగులకు, పింఛనుదారులకు పునర్‌వైభవం రావాలన్నా.. హక్కులు కాపాడుకోవాలన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. మన భద్రతకు మనమే కారణం కావాలి’ అని బుచ్చిరాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని