ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్‌టేబుల్‌ సమావేశం

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు.

Published : 09 May 2024 03:34 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పూర్వ ఎస్‌ఈసీ, సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో పాటు ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి సహా పలువురు సామాజికవేత్తలు, విద్యావంతులు పాల్గొని ఓటు ఆవశ్యకత పై ప్రసంగిస్తారని బుధవారం ఓ ప్రకటనలో సీఎఫ్‌డీ తెలిపింది. యువ ఓటర్లను చైతన్యం చేయడం కోసం సీఎఫ్‌డీ ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని