Tirupati Laddu: నిబంధనల మేరకే తితిదే లడ్డూ బరువు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు, నాణ్యత విషయంలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. నిబంధనల మేరకే బరువు, నాణ్యత ఉన్నాయని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ సీహెచ్‌ దయాకర్‌రెడ్డి తెలిపారు.

Updated : 12 Nov 2022 07:32 IST

తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు, నాణ్యత విషయంలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. నిబంధనల మేరకే బరువు, నాణ్యత ఉన్నాయని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ సీహెచ్‌ దయాకర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రాన్ని అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి.సుధాకర్‌తో కలిసి శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కౌంటర్లలో లడ్డూలను తూకం వేసిన అధికారులు బరువును పరిశీలించారు. వారి పరిశీలనలో 160 నుంచి 194 గ్రాముల మధ్య లడ్డూ బరువు ఉన్నట్లు గుర్తించారు. డిప్యూటీ కంట్రోలర్‌ మాట్లాడుతూ.. లడ్డూ విక్రయకేంద్రాన్ని తరచూ తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఎటువంటి తేడాలు లేవని పేర్కొన్నారు. లడ్డూ బరువుపై ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన భక్తుని వీడియోను పరిశీలించామని చెప్పారు. బరువు తక్కువ చూపించిన తూనిక యంత్రాన్ని పరిశీలించగా అందులో ఓ వైరు మధ్యలో పడటంతో తేడా వచ్చినట్లు గుర్తించామని, దీనిపై సంబంధిత కౌంటర్‌ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో వివాదం నెలకొందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని