ఐటీఆర్ ఫారంలు... ఏవి ఎవ‌రికి?

ఇవి 2018-19 మ‌దింపు సంవ‌త్స‌రానికి ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు ఆదాయ ప‌న్ను శాఖ 7 ఐటీఆర్ ఫారంలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వెరిఫికేష‌న్ కోసం ఐటీఆర్‌- V అవ‌స‌రం అవుతుంది. ప‌న్ను చెల్లింపుదారులు వారికి త‌గిన ఫారంను ఎంచుకొని రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌వ‌ల‌సి ఉంటుంది.…

Published : 23 Dec 2020 18:02 IST

ఇవి 2018-19 మ‌దింపు సంవ‌త్స‌రానికి ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు ఆదాయ ప‌న్ను శాఖ 7 ఐటీఆర్ ఫారంలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వెరిఫికేష‌న్ కోసం ఐటీఆర్‌- V అవ‌స‌రం అవుతుంది. ప‌న్ను చెల్లింపుదారులు వారికి త‌గిన ఫారంను ఎంచుకొని రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌వ‌ల‌సి ఉంటుంది.
ఏ ఫారం ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసుకుందాం…

ఐటీఆర్ ఫారం 1

దీనిని ‘స‌హ‌జ్’ అని కూడా అంటారు. భార‌త పౌరులు ఎవ‌రికైతే రూ.50 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తుందో వారికి ఇది వ‌ర్తిస్తుంది. ఇంటి అద్దె ద్వారా వ‌చ్చిన ఆదాయం, ఇత‌ర ఆదాయం కూడా క‌లిపి లెక్కిస్తారు. లాట‌రీలు, రేసుల్లో గెలిచిన డ‌బ్బును ఇందులో క‌ల‌ప‌రు. ఈ ఫారం ఎక్కువ వేత‌న జీవుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. వేత‌నం, ఇంటి అద్దె ఆదాయం, ఇత‌ర వ‌డ్డీ ఆదాయం వంటివి రూ.50 ల‌క్ష‌ల లోపు ఉన్న‌వారు ఈ ఫారం ఎంచుకోవాలి.

ఐటీఆర్ ఫారం-2

ఈ ఫారం వ్య‌క్తుల‌కు, హిందూ అవిభాజ్య కుంటుంబాల‌కు (హెచ్‌యూఎఫ్‌) ఎవ‌రికైతే వ్యాపారం, ఇత‌ర వృత్తుల ద్వారా ఆదాయం పొంద‌ని వారికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఐటీర్‌-1 వ‌ర్తించ‌ని వారికి ఐటీఆర్‌-2 వ‌ర్తిస్తుంది.

ఐటీఆర్ ఫారం-3

ఈ ఫారం హిందు అవిభాజ్య కుటుంబాలు ఎవ‌రైతే వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందుతారో వారికి వ‌ర్తిస్తుంది. అయితే ఈ ఫారం ఉప‌యోగించుకునేవారు ఐటీఆర్ ఫారం-4 ఎంచుకోకూడ‌దు.

ఐటీఆర్ ఫారం-4

దీనిని ‘సుగ‌మ్’ అని కూడా పిలుస్తారు. ఎవ‌రైతే వ్య‌క్తులు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందుతారో వారికి వ‌ర్తిస్తుంది. సెక్ష‌న్ 44ఏడీ, సెక్ష‌న్ 44ఏఈ లో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌త్యేకమైన వారికే ఈ ఫారం ఉప‌యోగించుకునే వీలుంది.

ఐటీఆర్ ఫారం-5

ఐటీఆఆర్ 5 ని సంస్థ‌లు, లిమిటెడ్ ల‌య‌బిలిటీ పార్ట్‌న‌ర్‌షిప్ (ఎల్ఎల్‌పీ), బృందాలు, ఆర్టిఫీషియ‌ల్ జురిడీషియ‌ల్ ప‌ర్స‌న్‌, కోఆప‌రేటివ్ సొసైటీ, రిజిస్ట‌ర్‌డ్ సోసైటీలు ఉప‌యోగింవ‌చవ‌చ్చు.

ఐటీఆర్ ఫారం-6

ఈ ఫారంను కంపెనీలు ఏవైతే సెక్ష‌న్ 11 చ‌ట్టం ప్ర‌కారం క్లెయిమ్ చేసుకోనివారికి వ‌ర్తిస్తుంది. సెక్ష‌న్ 111 కింద చారిట‌బుల్ ట్ర‌స్టులు క్లెయిమ్ చేసుకుంటాయి.

ఐటీఆర్ ఫారం-7

సెక్ష‌న్ 139 (4ఏ), 139 (4బీ), 139 (4సీ), 139 (4డీ), 139 (4ఈ), 139 (4ఎఫ్‌) ప్ర‌కారం రిట‌ర్నులు దాఖ‌లు చేసే వ్య‌క్తుల‌కు, కంపెనీల‌కు ఈ ఫారం వ‌ర్తిస్తుంది. ట్ర‌స్టులు, రాజకీయ పార్టీలు, సంస్థ‌లు, కళాశాల‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు కూడా ఇందులోకి వ‌స్తాయి.

ఐటీఆర్ ఫారం-V

ఇది ప‌న్న రిట‌ర్నులు దాఖ‌లు చేసిన త‌ర్వాత వెరిఫికేష‌న్ కోసం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆదాయ శాఖ ఇప్పుడు ఫైలింగ్ త‌ర్వాత వెరిఫికేష‌న్ త‌ప్పనిస‌రి చేసింది. గ‌తంలో బెంగుళూరు సీపీసీ కార్యాల‌యానికి ఐటీఆర్‌-V ఫారం పంపించి వెరిఫిక‌ష‌న్ పూర్తి చేసేవారు. అయితే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఆధార్ సాయంతో సుల‌భంగా వెరిఫై చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని