ఊగిసలాట ధోరణిలో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి

Updated : 29 Apr 2021 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 32 పాయింట్ల లాభంతో 49,765 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 14,894 స్థిరపడ్డాయి. ఉదయం భారీ లాభాల్లో మొదలైన మార్కెట్లు మెల్లగా నష్టాల్లోకి  జారుకొన్నాయి. చివరకు కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. మంగళూరు రిఫైన్‌, ఎక్సెలియా సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ, మేగమణి ఆర్గానిక్స్‌, సెయిల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సింగ్ని ఇంటర్నేషనల్‌, క్రాప్టన్‌ గ్రీవ్‌స్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

మాసంతంలోని ఎఫ్‌అండ్‌వోల ముగింపు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు కరోనా కేసులు, మృతులు రికార్డు స్థాయిలో నమోదు కావడం కూడా మదుపరులను భయపెట్టింది. లాక్‌డౌన్‌ భయాలు కూడా సూచీలను ముందుకు కదలనీయలేదు. ఇక ఐరోపామార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. అమెరికా ఫెడ్‌ నిర్ణయం ఈ మార్కెట్లకు అనుకూలించింది. ఇక రంగాల వారీగా చూస్తే.. లోహరంగ సూచీ అత్యధికంగా 5శాతం లాభపడగా.. ఆటోమొబైల్‌ రంగ సూచీ అత్యధికంగా 1.1శాతం పతనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని