Elon musk: సేల్స్‌ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్‌.. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్‌

టెస్లాలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఎలాన్‌ మస్క్‌ ఉద్వాసన పలికారు. టెస్లా కార్ల విక్రయాలు క్షీణించిన నేపథ్యంలో వీరిపై వేటు వేసినట్లు తెలిసింది.

Published : 30 Apr 2024 17:40 IST

Tesla job cuts | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాలో ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు పడింది. ఇటీవల కాలంలో టెస్లా విక్రయాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఆగ్రహంతో మస్క్‌ (Elon musk) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు వందలమంది ఉద్యోగులపై వేటు వేసేందుకు మస్క్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్‌ మేనేజర్లకు సీఈఓ రాసిన ఇ-మెయిల్‌లో ఈ విషయం వెల్లడైనట్లు ది ఇన్ఫర్మేషన్‌ అనే వార్తా సంస్థ పేర్కొంది.

టెస్లాలో సూపర్‌ఛార్జర్‌ వ్యాపార విభాగంలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రెబెక్కా టినుచి, న్యూ వెహికల్‌ ప్రోగ్రామ్ హెడ్‌గా ఉన్న డానియల్‌ హోపై తాజాగా వేటు పడింది. వీరితో కలిసి పని చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించాలని మస్క్‌ భావిస్తున్నట్లు ‘ఇన్ఫర్మేషన్‌’ తెలిసింది. సూపర్‌ ఛార్జర్‌ గ్రూప్‌లో 500 మంది పనిచేస్తుండగా.. న్యూ వెహికల్‌ ప్రోగ్రామ్‌లో ఎంతమంది పని చేస్తున్నదీ తెలియరాలేదు. ఈ రెండింటితో పాటు టెస్లా పబ్లిక్‌ పాలసీ టీమ్‌కు కూడా మస్క్‌ ఉద్వాసన పలకనున్నట్లు తెలిసింది.

విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?

‘‘ఉద్యోగాలు, ఖర్చులు తగ్గించుకునే విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ చర్యలు సూచిస్తున్నాయి’’ అని మస్క్‌ తన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. కొందరు ఎగ్జిక్యూటివ్‌లు దీన్ని సీరియస్‌గా తీసుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఇంకా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది ఉద్యోగులను టెస్లా తొలగించింది. కంపెనీని వృద్ధిలోకి తీసుకురావాలంటే కఠిన చర్యలు అవసరమంటూ తన నిర్ణయాన్ని మస్క్‌ సమర్థించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని