జీడీపీ అంచనాలు పెంచిన ఫిచ్‌ రేటింగ్స్‌.. రేట్ల కోత అప్పుడే!

Fitch raises India's GDP forecast: దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కాబోయే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది.

Published : 14 Mar 2024 13:44 IST

India GDP | దిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కాబోయే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. దేశీయంగా పెరిగిన డిమాండ్‌, వ్యాపారం స్థిరంగా కొనసాగుతుండడం వంటివి అందుకు కారణంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.8 శాతం వృద్ధి నమోదుకావొచ్చని పేర్కొంది. ప్రభుత్వ అంచనా (7.6 శాతం) కంటే ఇది అధికం.

గడిచిన మూడు త్రైమాసికాలుగా దేశీయంగా 8 శాతం కంటే అధికంగా వృద్ధి నమోదవుతున్న వేళ.. చివరి త్రైమాసికంలోనూ అదే ఒరవడి కొనసాగొచ్చని ఫిచ్‌ పేర్కొంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి  7.8 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది.  దేశీయ డిమాండ్‌, పెట్టుబడులు కొనసాగుతుందడడం వంటివి వృద్ధికి ఊతం ఇవ్వనున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగి వస్తుందని అంచనా వేసింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఆర్‌బీఐ 50 బేసిస్‌ పాయింట్ల మేర కీలక రేట్లను తగ్గించొచ్చని అంచనా కట్టింది. 2024లో ప్రపంచ జీడీపీ 2.4 శాతం మేర వృద్ధి చెందొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని