డెట్‌ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?

నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా?

Published : 01 Mar 2024 00:12 IST

నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా?

ప్రదీప్‌

రోగ్య బీమా పాలసీని తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం లేదు. మీరు చిరు వ్యాపారి అంటున్నారు కాబట్టి, రూ.10లక్షలకు ప్రీమియం ఏటా చెల్లించేందుకు వీలవుతుందా చూసుకోండి. ప్రీమియం చెల్లించడం కష్టం అనుకుంటే.. ఎంత వరకూ ప్రీమియం చెల్లించగలరో చూసుకొని, పాలసీని తీసుకోండి. ప్రీమియం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుందని మర్చిపోవద్దు. పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలు పూర్తిగా చెప్పడం మర్చిపోవద్దు.

నెలకు రూ.25వేలను మా పాప భవిష్యత్తు కోసం దాచి పెట్టాలనేది ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి. 10 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం జమ అవుతుంది?

శ్రీవిద్య

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుమీద టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. రెండు కంపెనీల నుంచి ఈ పాలసీలను తీసుకోండి. మీరు ఎక్కడ మదుపు చేసినా.. విద్యా ద్రవ్యోల్బణానికి మించి అధిక రాబడి వచ్చేలా చూసుకోండి. దీనికోసం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లు మేలు. మీరు రూ.25వేలు 10 ఏళ్లు పెట్టుబడి పెడితే.. 12 శాతం రాబడితో రూ.58,96,374 అయ్యేందుకు అవకాశం ఉంది.

నా వయసు 65. రూ.4లక్షల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉన్నాయి. వీటికన్నా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే అధిక రాబడి వస్తుందని చెబుతున్నారు. ఇది నిజమేనా? 

నరసింహ

ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైన వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. సీనియర్‌ సిటిజెన్లకు కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నాయి. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీôలో 8.2 శాతం రాబడి లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలోనూ 7.5 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. ఇందులో స్వల్పంగా నష్టభయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి, సీనియర్‌ సిటిజెన్‌ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను పరిశీలించండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని