పదవీ విరమణ నిధి కోసం...

నా వయసు 56. మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను. కొంత కాలంగా పసిడి మంచి లాభాలను ఇస్తోంది కదా.

Published : 31 May 2024 00:50 IST

నా వయసు 56. మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను. కొంత కాలంగా పసిడి మంచి లాభాలను ఇస్తోంది కదా. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు బంగారం లేదా బంగారం బాండ్లలో మదుపు చేయొచ్చా?

- శేఖర్‌
పదవీ విరమణ నిధిని జమ చేయడం ఎప్పుడూ మంచిదే. కానీ, దీనికోసం పూర్తిగా బంగారంపైనే ఆధారపడటం సరికాదు. మీ పెట్టుబడిలో కేవలం 10 శాతం వరకే పసిడికి కేటాయించాలి. పదవీ విరమణ నిధి కోసం బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్, మల్టీ అసెట్, హైబ్రిడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. డబ్బు జమైన తర్వాత క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. లేకపోతే అప్పటి పరిస్థితుల మేరకు మంచి రాబడినిచ్చే పథకాల్లో జమ చేసి, వడ్డీ ఆదాయం తీసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని