Income tax: ఐటీ చెల్లింపుదారులు@7.78కోట్లు.. గత 10 ఏళ్లలో రెట్టింపు

దేశంలో ఐటీ రిటర్నులు దాఖలు (Income tax returns) చేసే వారిసంఖ్య 7.78 కోట్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 23 Jan 2024 21:45 IST

దిల్లీ: దేశంలో గడిచిన పదేళ్ల కాలంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల (Tax Payers) సంఖ్య రెట్టింపయ్యింది. ఐటీ రిటర్నులు దాఖలు (Income tax returns) చేసే వారిసంఖ్య 7.78 కోట్లకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐటీకి సంబంధించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (CBDT) కీలక గణాంకాలను వెల్లడించింది.

‘2022-2023 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఆదాయపు పన్ను దాఖలు చేసే వారి సంఖ్య 7.78 కోట్లకు చేరుకుంది. 2013-14తో పోలిస్తే 104.91శాతం పెరుగుదల కనిపించింది. ఆ ఏడాది ఐటీ దాఖలు చేసిన వారి సంఖ్య 3.8కోట్లు మాత్రమే. అప్పుడు పన్నుల రూపంలో నికరంగా రూ.6,38,596 కోట్లు వసూలు కాగా 2022-23 నాటికి రూ.16,63,686 కోట్లకు పెరిగింది. మొత్తంగా నికర పన్నుల వసూళ్లలో 160.52శాతం వృద్ధి కనిపించింది’ అని సీబీడీటీ వెల్లడించింది.

ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్‌) ద్వారా రూ.18.23లక్షల కోట్లు వసూలు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.16.61లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75శాతం ఎక్కువ. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయానికొస్తే ఆర్థిక సంవత్సరం 2013-14తో పోలినప్పుడు 2022-23ఆర్థిక సంవత్సరానికి 173.31శాతం పెరిగిందని సీబీడీటీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని