Kushaq Monte Carlo: స్కోడా కుషాక్‌లో మోంటే కార్లో ఎడిషన్ @15.99 లక్షలు
స్కోడా ఆటో ఇండియా తమ మధ్యశ్రేణి ఎస్యూవీ విభాగంలోని కుషాక్‌కు మోంటే కార్లో ఎడిషన్‌ను తీసుకొచ్చింది....
దిల్లీ: స్కోడా ఆటో ఇండియా తమ మధ్యశ్రేణి ఎస్యూవీ విభాగంలోని కుషాక్‌కు మోంటే కార్లో ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.15.99-19.49 లక్షలు (దిల్లీ, ఎక్స్‌షోరూం).
🚗 6-స్పీడ్ మాన్యువల్ ట్రిమ్ 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ధర రూ.15.99 లక్షలు. దీంట్లోనే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.17.99 లక్షలు. ఈ ఇంజిన్ 115 హెచ్‌పీ 175 ఎన్ఎం గరిష్ఠ టార్క్ వద్ద 115 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
🚗 1.5 లీటర్ ఇంజిన్ మాన్యువల్ ట్రిమ్ ధర రూ.17.89 లక్షలు కాగా.. దీంట్లోనే ఆటోమేటిక్ ట్రిమ్ ధర రూ.19.49 లక్షలు. ఇది 250 ఎన్ఎం టార్క్ వద్ద 150 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
🚗 ఈ కొత్త కుషాక్ మోంటే కార్లో కారు టోర్నడో రెడ్, క్యాండీ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
🚗 ఇంధన సామర్థ్యాన్ని పెంచే స్టార్ట్-స్టాప్ 1.0 టీఎస్ఐ వ్యవస్థను ఈ కారులో ప్రామాణీకరించారు.
🚗 ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, 10 అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ని కూడా ఇచ్చారు.
🚗 భద్రత విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.