Crime news: 1,900 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాల స్వాధీనం..

బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1900 కేజీల బరువున్న వెండి ఇటుకలు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌

Updated : 09 May 2022 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1900 కేజీల బరువున్న వెండి ఇటుకలు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. 450 కిలోల బరువున్న వెండి ఇటుకలు, మరో 772 కిలోల వెండి ఆభరణాలు దొరికాయి. బస్సు డ్రైవర్ పొంతన లేని సమాధానం ఇవ్వడం, సరైన పత్రాలు చూపకపోవడంతో మొత్తం 1,222 కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వాటి విలువ రూ.8 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు. వెండిని అహ్మదాబాద్​ నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్​పుర్​, జైపుర్​, యూపీలోని ఆగ్రా వంటి నగరాల్లో డెలివరీ చేసేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మరో ఘటనలో.. ఆగ్రా నుంచి గుజరాత్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులోనూ తనిఖీలు నిర్వహించి 700 కిలోల వెండిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని