Crime newes: గురుగ్రామ్‌లో కూలిన అపార్ట్‌మెంట్‌ పైకప్పు.. ఇద్దరి మృతి!

హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌ పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు చిక్కుకుపోయినట్టు..

Published : 11 Feb 2022 01:34 IST

గురుగ్రామ్‌: హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌ పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ ఘటన గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 109 పరిధిలో సింటెల్స్‌ పారాడిసో హౌసింగ్‌ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పలువురు జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా చేరుకొని శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని